సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 21:01:53

KKR vs CSK: మోర్గాన్‌, రస్సెల్‌ ఔట్‌

KKR vs CSK: మోర్గాన్‌, రస్సెల్‌ ఔట్‌

అబుదాబి: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.  సూపర్‌ ఫామ్‌లో ఉన్న హార్డ్‌హిట్టర్‌ ఇయాన్‌ మోర్గాన్‌(7).. శామ్‌ కరన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.   14వ ఓవర్లో    మోర్గాన్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో  వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.      యువ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి మరో ఎండ్‌లో  పరుగుల వరద పారిస్తున్నాడు.

చెన్నై బౌలింగ్‌ను ‌ ధాటిగా ఎదుర్కొంటూ కోల్‌కతాకు భారీ స్కోరు అందించే లక్ష్యంగా దూకుడుగా ఆడుతున్నాడు. మోర్గాన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్‌(2) మరోసారి విఫలమయ్యాడు.  శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 16వ ఓవర్లో ధోనీకి క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ బాటపట్టాడు.  16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. త్రిపాఠి(75), కార్తీక్‌(4) క్రీజులో ఉన్నారు.