సోమవారం 03 ఆగస్టు 2020
Sports - Jul 07, 2020 , 10:03:07

సీపీఎల్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా ప్రవీణ్‌

సీపీఎల్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా ప్రవీణ్‌

ముంబై:   41ఏండ్ల వయసులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అరంగేట్రం చేసి  అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన వెటరన్‌ లెగ్‌స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే త్వరలో ఓ విదేశీ లీగ్‌లో ఆడనున్నాడు. 48ఏండ్ల తాంబే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)కు ఎంపికయ్యాడు.  ఆటగాళ్ల వేలంలో అతడిని  టిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ దక్కించుకున్నది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌..టిన్‌బాగో జట్టుకు కూడా కో ఓనర్‌గా  ఉన్నారు.  

ఈ ఏడాది సీపీఎల్‌  ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు జరగనుంది. సీపీఎల్‌-2020 సీజ‌న్‌లో  ఆరు జట్లు పాల్గొంటున్నాయి.   ఐపీఎల్‌లో  తాంబే రాజస్థాన్‌ రాయల్స్‌,  గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌   జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo