Sports
- Dec 04, 2020 , 00:31:03
మారడోనాకు నివాళి.. మెస్సీకి జరిమానా

బార్సిలోనా: ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనాకు నివాళి తెలిపేందుకు చేసిన చర్యతో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీపై జరిమానా వేటు పడింది. స్పానిష్ లీగ్లో బార్సిలోనా తరఫున ఒసాసునా జట్టుపై గోల్ సాధించాక మెస్సీ తన షర్టును విప్పి లోపల తాను వేసుకున్న మారడోనా జెర్సీని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆకాశం వైపు చూసి రెండు చేతులు పైకెత్తి ముద్దులు పెడుతూ డిగోకు నివాళి అర్పించాడు. అయితే మ్యాచ్ గోల్ చేసిన సంబరాల్లో షర్టు విప్పడం లీగ్ నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించిన స్పానిష్ సాకర్ సమాఖ్య మెస్సీకి రూ.53,115, బార్సిలోనాకు రూ.15,934 జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో బార్సిలోనా 4-0తేడాతో ఒసాసునాపై గెలిచింది.
తాజావార్తలు
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
MOST READ
TRENDING