శుక్రవారం 10 జూలై 2020
Sports - Feb 23, 2020 , 10:09:56

కోహ్లీ ఔట్‌.. కష్టాల్లో భారత్‌

కోహ్లీ ఔట్‌.. కష్టాల్లో భారత్‌

వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఆటతీరులో ఎలాంటి మార్పు లేదు. తొలి ఇన్నింగ్స్‌ మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ రాణించగా.. భారత బ్యాట్స్‌మెన్‌ మాత్రం ఏమాత్రం పోరాడలేకపోతున్నారు. కివీస్‌ స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కళ్లుచెదిరే బంతులతో భారత్‌ను భారీ దెబ్బకొట్టాడు.  రెండో ఇన్నింగ్స్‌లో బౌల్ట్‌ ధాటికి భారత్‌ 113 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌(58) మాత్రం అర్ధశతకంతో ఆకట్టుకోవడంతో భారత్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(11), విరాట్‌ కోహ్లీ(19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేయగా బౌల్ట్‌ చక్కటి బౌలింగ్‌తో పెవిలియన్‌ పంపాడు. 48 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 115 పరుగులు చేసింది. హనుమ విహారి(2), రహానె(9) క్రీజులో ఉన్నారు. కోహ్లీసేన ఇంకా 68 పరుగుల వెనుకంజలో ఉంది. logo