బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 23:58:49

కోహ్లీని ఔట్‌ చేసేందుకు ఆగలేకున్నా

కోహ్లీని ఔట్‌ చేసేందుకు ఆగలేకున్నా

వెల్లింగ్టన్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేసేందుకు వేచి చూడలేకున్నానని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. గాయం కారణంగా భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన అతడు.. టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. కుడిచేతి గాయంతో ఆరు వారాలుగా ఆటకు దూరం కాగా, శుక్రవారం భారత్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టులో బౌల్ట్‌ బరిలోకి దిగనున్నాడు. ‘విరాట్‌ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేసేందుకు, నన్ను పరీక్షించుకునేందుకే నేను ఆడతా. అందుకే, వేచిచూడలేకున్నా. కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అందరికీ తెలుసు’ అని బౌల్ట్‌ మంగళవారం చెప్పాడు. గత టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో కివీస్‌ 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే, ఆ పరాజయం తమకు పాఠాలు నేర్పిందని, భారత్‌పై సత్తాచాటుతామని బౌల్ట్‌ చెప్పాడు.


logo