హామిల్టన్: టోక్యో ఒలింపిక్స్‌కు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్ కానుంది. ఆ దేశ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ జట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు 2013 వరకు హబ్బర్డ్ పురుషుల ఈవెంట్స్‌లో పోటీపడ్డాడు.