గురువారం 16 జూలై 2020
Sports - May 06, 2020 , 17:58:57

ఈ ఫొటోలో వ్య‌క్తిని గుర్తుప‌ట్టారా..!

ఈ ఫొటోలో వ్య‌క్తిని గుర్తుప‌ట్టారా..!

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రానికి ముందు క్రికెట్ మ‌క్కా లార్డ్స్ మైదానంలో దిగిన ఫొటోను టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఇన్‌స్ట‌గ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. 1996 ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో అరంగేంట్రం చేసిన గంగూలీ.. తొలి మ్యాచ్ ఆడేందుకు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను తాజాగా పోస్ట్ చేశాడు. `1996లో తొలి టెస్టు ఆడ‌టానికి ముందు రోజు లార్డ్స్‌లో ప్రాక్టీస్‌` అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. 

కెరీర్ తొలి టెస్టులోనే గంగూలీ అద్వితీయ శ‌త‌కంతో చెల‌రేగిన విష‌యం తెలిసిందే. లార్డ్స్‌లో పేస‌ర్ల‌ను కాచుకుంటూ 301 బంతులు ఎదుర్కొన్న దాదా 131 ప‌రుగులు చేశాడు. అందులో 20 ఫోర్లు ఉన్నాయి. logo