మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 09, 2020 , 23:03:49

టీ20 ఛాలెంజ్‌: తొలిసారి టైటిల్‌ నెగ్గిన ట్రయల్‌ బ్లేజర్స్‌

 టీ20 ఛాలెంజ్‌:  తొలిసారి టైటిల్‌ నెగ్గిన ట్రయల్‌  బ్లేజర్స్‌

షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్‌-2020 సీజన్‌ విజేతగా స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ నిలిచింది. సోమవారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌ నోవాస్‌తో జరిగిన టైటిల్‌ పోరులో బ్లేజర్స్‌ 16  పరుగుల తేడాతో విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో నోవాస్‌ బ్యాటర్లు తడబడ్డారు.

ఛేదనలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(30) మాత్రమే పోరాడటంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసింది.  పరుగులు రావడం కష్టంగా మారిన ఈ పిచ్‌పై  మంధాన  ఒంటరిగా పోరాడి   జట్టుకు తొలి టైటిల్‌ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఛేదనలో నోవాస్‌ బ్యాట్స్‌వుమెన్‌ను బ్లేజర్స్‌ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు.

అంతకుముందు  మంధాన(68: 49 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో రాణించడంతో బ్లేజర్స్‌  20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో పరుగులిచ్చినా తర్వాత గట్టిగా పుంజుకున్న సూపర్‌ నోవాస్‌ బౌలర్లు ప్రత్యర్థిని బాగా కట్టడి చేశారు. పూనమ్‌ యాదవ్‌, సిరివర్దనే చెరో వికెట్‌ పడగొట్టారు. 

 డాటిన్‌(20), రిచా ఘోష్‌(10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీప్తి శర్మ(9), హర్లీన్‌ డియో(4), సోఫీ ఎక్లిస్టోన్‌(1) నిరాశపరిచారు.  మంధాన, డాటిన్‌ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించింది.