శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 02:26:19

గంగూలీ గొప్ప కెప్టెన్‌: అక్తర్‌

గంగూలీ గొప్ప కెప్టెన్‌: అక్తర్‌

 న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ గొప్ప కెప్టెన్‌ అంటూ పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసించాడు. అలాగే దాదా అత్యంత కఠినమైన ప్రత్యర్థి అని రాసుకొచ్చాడు. గతంలో భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు గంగూలీతో దిగిన ఫొటోను అక్తర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘నేను ఏ జట్టు మీద ఆడేందుకైనా ఉత్సాహంతో ఉండేవాడిని. ఎందుకంటే పోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధించడమంటే నాకు ఇష్టం. అయితే నేను ఎదుర్కొన్న కఠినమైన ప్రత్యర్థుల్లో సౌరవ్‌ గంగూలీ ఒకడు. అతడు గొప్ప కెప్టెన్‌ కూడా. అతడి సారథ్యంలోనే నేను కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఆడాను’అని అక్తర్‌ రాసుకొచ్చాడు. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008లో దాదా కెప్టెన్‌గా ఉన్న కోల్‌కతా తరపున అక్తర్‌ ఆడాడు. 


logo