మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 12, 2020 , 13:24:56

ధ‌ర్మ‌శాల‌లో వ‌ర్షం.. టాస్ ఆల‌స్యం

ధ‌ర్మ‌శాల‌లో వ‌ర్షం.. టాస్ ఆల‌స్యం

ధ‌ర్మ‌శాల :  న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఎదురైన ప‌రాభావాల నుండి తేరుకుంటున్న భార‌త్ చాలా గ్యాప్ త‌ర్వాత స్వ‌దేశంలో తొలి పోరుకి సిద్ధ‌మైంది.  హిమాలయ పర్వత సానువుల్లోని ధర్మశాల వేదిక‌గా జ‌రిగే తొలి వ‌న్డేలో సౌతాఫ్రికాతో పోటీ ప‌డుతుంది భార‌త్‌.  ఇప్ప‌టికే మ్యాచ్ ప్రారంభం కావ‌ల‌సి ఉండ‌గా, వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అవుతుంది. వ‌రుణుడు క‌రుణించి ఈ మ్యాచ్‌కి ఆటంకం క‌లిగించ‌క‌పోతే మాత్రం  తొలి వ‌న్డే ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాగా,  గాయాల నుంచి కోలుకున్న ధవన్‌, హార్దిక్‌, భువీ తిరిగి రావడంతో టీమ్ ఇండియా పటిష్ఠంగా క‌నిపిస్తుంది. మ‌రోవైపు ఆస్ట్రేలియాని క్లీన్ స్వీప్ చేసిన ద‌క్షిణాఫ్రికా కూడా మంచి ఊపులో ఉంది. ఇదిలా ఉంటే  క‌రోనాతో పాటు వ‌ర్షం కార‌ణంగా స్టేడియంకి వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య భారీగా త‌గ్గింది. స్టాండ్స్ అన్నీ ఖాళీగా క‌నిపిస్తున్నాయి. 


logo
>>>>>>