బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 13:31:38

న్యూజిలాండ్ బౌలింగ్‌కి విల‌విలలాడుతున్న భార‌త్

న్యూజిలాండ్ బౌలింగ్‌కి విల‌విలలాడుతున్న భార‌త్

వెల్లింగ్టన్ :  వ‌న్డే సిరీస్ కోల్పోయిన భార‌త్ టెస్ట్ సిరీస్‌లో రాణించాల‌నే కృత‌నిశ్చ‌యంతో తొలి టెస్ట్‌లోకి బ‌రిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. రోహిత్‌, శిఖ‌ర్ గైర్హాజ‌రుతో ఓపెన‌ర్లుగా పృథ్వీ షా, మ‌యాంక్ అగ‌ర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని ఈ ఇద్ద‌రు ఓపెన‌ర్లు స‌రిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోయారు. షా 16 ప‌రుగుల‌కే ఔట్ కాగా, ఆ త‌ర్వాత వ‌చ్చిన పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2) త‌క్కువ స్కోర్ల‌కే వెనుదిరిగారు. దీంతో 40 పరుగుల‌కే ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.

క‌ష్టాల్లో ఉన్న భార‌త్‌ని  మ‌యాంక్ అగ‌ర్వాల్ (34),అజింక్య ర‌హానే (34 ) ఆదుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి 48 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. కొద్ది సేప‌టికి  మయాంక్ , విహారి (7) వికెట్లు వెంట‌వెంట‌నే కోల్పోవ‌డంతో భార‌త్ ప్ర‌స్తుతానికి 5 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది.   అరంగేట్ర బౌల‌ర్ కైలీ జెమీస‌న్‌కు మూడు వికెట్లు ద‌క్కాయి. టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ హోదాతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేస్తుందో లేదో చూడాలి. 


logo