మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 16:34:43

టాప్ ర్యాంక్ సుమో రెజ్ల‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌..

టాప్ ర్యాంక్ సుమో రెజ్ల‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌..

టోక్యో:  జ‌పాన్‌కు చెందిన టాప్ ర్యాంక్ సుమో రెజ్ల‌ర్ హ‌కూహోకు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. వైర‌స్ ప‌రీక్ష‌లో అత‌ను పాజిటివ్‌గా తేలిన‌ట్లు జ‌పాన్ సుమో సంఘం వెల్ల‌డించింది.  మంగోలియాలో పుట్టిన హకూహో.. చాలా ఏళ్ల నుంచి యోకోజునాగా గుర్తింపు పొందారు.  సుమో రెజ్ల‌ర్‌గా అత‌ను టాప్ ర్యాంక్‌లో కొన‌సాగుతున్న‌ట్లు జ‌పాన్ సుమో అసోసియేష‌న్ ప్ర‌క‌టించింది.  వాస‌న కోల్పోవ‌డం వ‌ల్ల హకూహోకు కోవిడ్ ప‌రీక్ష చేశారు. స్పెష‌లిస్టు వైద్యుల వ‌ద్ద హ‌కూహో చికిత్స తీసుకోనున్నారు. మియాజినో అకాడ‌మీలో ఉన్న ఇత‌ర సుమోల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. జ‌న‌వ‌రి 10వ తేదీ ప్రారంభం కానున్న న్యూ ఇయ‌ర్ గ్రాండ్ సుమో టోర్నీకి అయిదు రోజుల ముందు హ‌కూహోకు పాజిటివ్ రావ‌డం శోచ‌నీయం. అయితే ఆ టోర్నీని వాయిదా వేస్తారా లేదా అన్న విష‌యాన్ని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. గ‌త ఏడాది మే నెల‌లో 28 ఏళ్ల సుమో రెజ్ల‌ర్ శోబుషి కరోనా వల్ల మ‌ర‌ణించాడు. జ‌పాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,49,246 మందికి వైర‌స్ సంక్ర‌మించింది.  3693 మంది మ‌ర‌ణించారు.   


logo