ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక పెన్నుల వాడకం తగ్గింది. ఎవరో కొద్దిమంది మాత్రమే పెన్నులను ఇష్టపడుతున్నారు. అందులోనూ వాటిల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే కొనడానికి ఆసక్తిచూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఆన్ లైన్ లో ఈ పెన్నుకి తెగ డిమాండ్ ఏర్పడింది. అందుకుకారణం ఇదిగో ఈస్పెషాల్టీనే. జాగ్రత్తగా చూడండి. పెన్ను మూతలో ఏదో కదులుతోంది కదా !
ఇంతకీ నీటిలో కదులుతున్నది ఏంటనేగా మీరు అడిగేది. అది ఒకరమైన పరాన్నజీవి. బతికున్న పురుగునే ఇలా పెన్నులో పెట్టి జపాన్ కి చెందిన ఓ కంపెనీ అమ్మేస్తోంది. దీని ధర ఎంతో తెలుసా మన కరెన్సీలో దాదాపు 700 వరకు ఉంటుంది. అయితే ఈ పరాన్న జీవి మూడునాలుగురోజుల వరకే బతికి ఉంటుంది. చాలామంది ప్రేమకి గుర్తుగా పెన్నుని ఇస్తారు. ఇప్పుడలా ఈపెన్నుని ఇచ్చేందుకు ఆసక్తిచూపించడంతో ఆన్ లైన్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.