గురువారం 16 జూలై 2020
Sports - Jun 01, 2020 , 19:43:20

ఆసీస్‌ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ షురూ

ఆసీస్‌ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ షురూ

సిడ్నీ: కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో రెండు నెలలకు పైగా ఇండ్లకే పరిమితమైన ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను మళ్లీ ప్రారంభించారు. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌లో సోమవారం కసరత్తులు చేశారు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కాగా ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 7వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం... ప్లేయర్లు ప్రాక్టీస్‌ ఔట్‌డోర్‌ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఆగస్టు 9 నుంచి జింబాబ్వే పర్యటనతో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రణాళిక రచించింది. దీంతో ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు శ్రమించానని స్టీవ్‌ స్మిత్‌ చెప్పాడు. గత కొన్నేండ్ల కన్నా ఇప్పుడు మరింత ఫిట్‌గా తయారయ్యానని అన్నాడు.  


logo