శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 12:54:02

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న స్టార్‌ క్రికెటర్లు

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న  స్టార్‌ క్రికెటర్లు

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆరంభ దశ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు స్టార్‌ క్రికెటర్లు దూరంకానున్నారు.     సెప్టెంబర్‌ 4 నుంచి 16 మధ్య మూ డు టీ20లు (4,6,8 తేదీల్లో), మూడు వన్డేల్లో(11,13, 16 తేదీల్లో)  ఆసీస్‌, ఇంగ్లాండ్‌ జట్లు    తలపడనున్నాయి. ఈ సిరీస్‌ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్‌-13 కోసం వారం ఆలస్యంగా తమతమ జట్లతో కలవనున్నారు.  ఐపీఎల్‌  8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసీస్‌ నుంచే  12 మంది ఆటగాళ్లు  ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నది.    

టాప్‌ ఆసీస్‌ క్రికెటర్లు ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ పింఛ్‌, స్టీవ్‌ స్మిత్‌, పాట్‌ కమిన్స్‌, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, కేన్‌ రిచర్డ్సన్‌, అలెక్స్‌ కేరీ, మార్క్‌ స్టోయినీస్‌, హేజిల్‌వుడ్‌, ఆండ్రూ టై తదితరులు ఉన్నారు. స్మిత్‌ రాజస్తాన్‌ జట్టుకు,  వార్నర్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ఇంగ్లాండ్‌ నుంచి ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌స్టో తదితరులు సెప్టెంబర్‌ 26 తర్వాతనే లీగ్‌లో పాల్గొననున్నారు. ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభంకానుంది. logo