గురువారం 09 జూలై 2020
Sports - Apr 30, 2020 , 00:25:41

ఒలింపిక్స్‌లో టాప్‌-10 సాధ్యమే

ఒలింపిక్స్‌లో టాప్‌-10 సాధ్యమే

న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-10లో చోటు దక్కించుకోవడం అసాధ్యం కాదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఇది సవాల్‌తో కూడుకున్న లక్ష్యమే అయినా సాధ్యపడుతుందని, దాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని చెప్పా రు. సాయ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆన్‌లైన్‌ సెషన్‌లో కిరణ్‌ రిజిజు బుధవారం టీటీ కోచ్‌లను ఉద్దేశించి ప్రసంగించారు.  ‘2028 ఒలింపిక్స్‌ పతకాల పట్టికలోని టాప్‌-10 దేశాల్లో భారత్‌ స్థానాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇది ప్రతిష్ఠాత్మక లక్ష్యమే అయినా అసాధ్యం కాదు’ ఇప్పటికే యువ అథ్లెట్ల కోసం అన్వేషణ ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ ముగిశాక మళ్లీ కొనసాగుతుంది’అని రిజీజు అన్నాడు.


logo