మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 07:50:38

లాథమ్‌ హాఫ్‌ సెంచరీ.. విజయం దిశగా న్యూజిలాండ్‌

లాథమ్‌ హాఫ్‌ సెంచరీ.. విజయం దిశగా న్యూజిలాండ్‌

క్రైస్ట్‌చర్చ్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య కివీస్‌.. విజయం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(52), బ్లండెల్‌(47) తమ సమయోచిత బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న లాథమ్‌.. విజయానికి 29 పరుగులు అవసరమైన క్రమంలో ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కివీస్‌.. 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 108 పరుగులు చేసింది.టామ్‌ బ్లండెల్‌(47), కెప్టెన్‌ విలియమ్సన్‌(1) క్రీజులో ఉన్నారు. కాగా, కివీస్‌ విజయానికి 24 పరుగుల దూరంలో ఉంది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలతో అదరగొట్టాడు.


logo