శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 17:58:29

బంతిని చేత్తో ఆపి.. ఔటయ్యాడు

బంతిని చేత్తో ఆపి.. ఔటయ్యాడు

వెల్లింగ్టన్‌: వికెట్లకు తగలబోతున్న బంతిని చేత్తో ఆపి న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్లండెల్‌ అరుదైన రీతిలో ఔటయ్యాడు. న్యూజిలాండ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వెల్లింగ్టన్‌ ప్రావిన్స్‌ తరఫున ఆడుతున్న అతడు ఒటాగోతో మ్యాచ్‌లో ఈ తప్పిదం చేశాడు. 101 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బ్యాట్‌కు తగిలిన    బంతి వికెట్లకు తగులబోతుండగా కాలితో ఆపే ప్రయత్నం చేసిన బ్లండెల్‌ అనుకోకుండా బంతికి అడ్డంగా చేయి తగిలించాడు.

దీంతో అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు.  60 ఏండ్ల క్రితం జాన్‌ హయెస్‌ ఈ తీరుగా ఔట్‌ కాగా.. ఈ తప్పిదం చేసిన రెండో న్యూజిలాండ్‌ ఆటగాడిగా బ్లండెల్‌ నిలిచాడు. కాగా టెస్టు చరిత్రలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ లెన్‌ హట్టన్‌ మాత్రమే బంతిని చేత్తో అడ్డగించి 1951లో ఔటయ్యాడు.