ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 10, 2020 , 14:59:10

స‌న్నాహ‌కాల‌కు మ‌రింత స‌మ‌యం: కేటీ ఇర్ఫాన్‌

స‌న్నాహ‌కాల‌కు మ‌రింత స‌మ‌యం:  కేటీ ఇర్ఫాన్‌

బెంగ‌ళూరు: టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టంతో ల‌భించిన స‌మ‌యాన్ని మెరుగైన శిక్ష‌ణ కోసం వినియోగించుకుంటాన‌ని భార‌త రేస్ వాక‌ర్ కేటీ ఇర్ఫాన్ అన్నాడు. గతేడాది జ‌రిగిన ఆసియా రేస్ వాకింగ్ చాంపియ‌న్‌షిప్‌లో నాలుగోస్థానంలో నిలిచి ఒలింపిక్స్ బెర్త్ ద‌క్కించుకున్న ఇర్ఫాన్ ప్రస్తుతం బెంగ‌ళూరులోని సాయ్ కేంద్రంలో శిక్ష‌ణ పొందుతున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా హాస్ట‌ల్ గ‌దుల్లోనే చిన్న చిన్న వ‌ర్కౌట్స్ చేస్తున్న ఇర్ఫాన్‌.. త్వ‌ర‌లోనే ఔట్‌డోర్ సాధ‌న ప్రారంభిస్తాన‌ని అంటున్నాడు. 

`టోక్యో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టం మంచికే అయింది. ఈ విరామాన్ని వినియోగించుకొని ప‌త‌కానికి మ‌రింత చేరువ కావాల‌నుకుంటున్నా. ఈ గ‌డువు విశ్వ‌క్రీడ‌ల్లో నా ప్ర‌ద‌ర్శ‌న‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని న‌మ్ముతున్నా. ఒలింపిక్స్‌లో ప‌త‌కం నెగ్గ‌డ‌మే నా ఏకైక ల‌క్ష్యం. దాన్ని సాధించేందుకే క‌ష్ట‌ప‌డుతున్నా. బెంగ‌ళూరులోని సాయ్ కేంద్రంలో వ‌స‌తులు బాగున్నాయి. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా హాస్ట‌ల్ గ‌దుల్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం అత‌లాకుత‌ల‌మ‌వుతున్నది. త్వ‌ర‌లోనే ఈ మ‌హ‌మ్మారి పీడ విరుగ‌డ కావాల‌ని కోరుకుంటున్నా` అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.logo