గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 24, 2020 , 01:25:59

అథ్లెట్లందరికీ కరోనా పరీక్షలు

అథ్లెట్లందరికీ కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం జపాన్‌కు వచ్చే అథ్లెట్లందరికీ తప్పనిసరిగా కరోనా వైరస్‌ పరీక్షలు జరుపాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే 14రోజుల క్వారంటైన్‌ నుంచి సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధవారం టోక్యో 2020 నిర్వాహక కమిటీ, జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు, టోక్యో మెట్రోపాలిటన్‌ అధికారుల సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ విడుదల చేశారు. జపాన్‌లో అథ్లెట్ల ప్రయాణాలను సైతం వీలైనంతగా తగ్గించాలని ప్రతిపాదించారు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో జపాన్‌ నూతన ప్రధాని ఇషిహిండే సుగా ఫోన్‌లో చర్చలు జరిపారు. విశ్వక్రీడల కోసం వచ్చేవారికి ప్రయాణ నిబంధనల నుంచి సడలింపులు ఇవ్వాలని జపాన్‌ ప్రభుత్వానికి ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ సీఈవో తషిరో ముటో సూచించారు.