శుక్రవారం 29 మే 2020
Sports - Apr 10, 2020 , 15:36:41

2021లోనూ ఒలింపిక్స్ అనుమాన‌మే: సీఈవో

2021లోనూ ఒలింపిక్స్ అనుమాన‌మే:  సీఈవో

టోక్యో: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాది కూడా జ‌రుగుతాయా అంటే కచ్చితంగా ఔన‌ని స‌మాధానం చెప్పే ప‌రిస్థితి లేద‌ని ఒలింపిక్స్ సీఈవో తొషిరో మోటో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్ర‌కారం ఈ ఏడాది జ‌రుగాల్సిన విశ్వ‌క్రీడ‌ల‌ను క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా 2021కి వాయిదా వేశారు. జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే దేశ‌వ్యాప్త ఎమ‌ర్జెన్సీ విధించిన నేప‌థ్యంలో తొషిరో మోటో మాట్లాడుతూ.. `వ‌చ్చే ఏడాది జూలై వ‌ర‌కు ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంద‌ని ఎవ‌రైనా క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌రా?  ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న‌కు మావ‌ద్ద జ‌వాబు లేదు` అని అన్నారు.

కొవిడ్‌-19 కార‌ణంగా గ‌త నెల‌లో వాయిదా ప‌డిన ప్ర‌తిష్ఠాత్మ‌క క్రీడ‌లు వ‌చ్చే ఏడాది జూలై 23న ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. సీఈవో మాట‌లు కొత్త అనుమానాలు రెకెత్తిస్తున్నాయి. 


logo