ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Sep 25, 2020 , 00:37:37

వ్యాక్సిన్‌ రాకున్నా క్రీడలు సాధ్యమే

వ్యాక్సిన్‌ రాకున్నా క్రీడలు సాధ్యమే

ఐవోఏ అధ్యక్షుడు బాచ్‌ 

టోక్యో: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రాకున్నా సురక్షితంగా క్రీడలు నిర్వహించవచ్చని ఇటీవల కొన్ని టోర్నీలు చూశాక అర్థమైందని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ వచ్చినా రాకున్నా టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణకే మొగ్గు చూపుతామని గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే వచ్చే ఏడాది జూలైలో విశ్వక్రీడలు ప్రారంభమయ్యేలోగా వ్యాక్సిన్‌ వస్తుందని తాము నమ్ముతున్నామని బాచ్‌ అన్నారు. డోసుల కోసం ఇప్పటికే కొన్ని ఫార్మా సంస్థలను సంప్రదిస్తున్నామని వెల్లడించారు. కాగా కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.