సోమవారం 25 మే 2020
Sports - Apr 06, 2020 , 13:55:13

టోక్యో 2021కు సిద్ద‌మ‌వుతున్నా: సుశీల్

టోక్యో 2021కు సిద్ద‌మ‌వుతున్నా: సుశీల్

టోక్యో 2021కు సిద్ద‌మ‌వుతున్నా: సుశీల్

న్యూఢిల్లీ:  ఓవైపు వ‌య‌సు పెరిగినా..త‌నలో స‌త్తా త‌గ్గ‌లేద‌ని భార‌త సీనియ‌ర్ సుశీల్ కుమార్ అన్నాడు. ఎవ‌రు ఏమ‌నుకున్నా..వ‌చ్చే ఏడాది జ‌రిగే టోక్యో ఒలింపిక్స్ కోసం తాను సిద్ధ‌మ‌వుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా రిటైర్మెంట్ వార్త‌ల‌ను ఖండిస్తూ ఇప్ప‌టి నుంచి ప్రాక్టీస్‌ను మ‌రింత ముమ్మ‌రం చేస్తాన‌ని పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మైన ఈ స్టార్ రెజ్ల‌ర్..వాయిదాను తాను అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. వాస్త‌వానికి ఈ ఏడాది జూలైలో జ‌రుగాల్సిన టోక్యో విశ్వ‌క్రీడలు క‌రోనా వైర‌స్ కార‌ణంగా..2021కి వాయిదా ప‌డిన సంగతి తెలిసిందే. ‘ఇప్ప‌టినుంచి నేను ఎక్క‌డికి వెళ్లడం లేదు. టోక్యో ఒలింపిక్స్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధ‌మ‌య్యేందుకు  చాలా స‌మ‌య‌ముంది. ఇప్ప‌టికీ రెండు రోజుల‌కోసారి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆట‌పై ప‌ట్టుకోల్పోకుండా ఉండేందుకు ఇది బాగా ఉప‌యోగ‌పడుతుంది. గాయాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ’ అని సుశీల్ అన్నాడు. మ‌రోవైపు యువ రెజ్ల‌ర్ నర్సింగ్‌యాద‌వ్ జూలైలో  నాలుగేండ్ల నిషేధం నుంచి బ‌య‌ట‌ప‌డ‌బోతున్నాడు. ఈ నేప‌థ్యంలో టోక్యో ఒలింపిక్స్ బెర్తు కోసం గ‌తంలో లాగే సుశీల్‌, న‌ర్సింగ్ మ‌ధ్య తీవ్ర పోటీ ఏర్ప‌డే అవ‌కాశ‌ముంది. 


logo