సోమవారం 30 నవంబర్ 2020
Sports - Sep 28, 2020 , 21:26:41

వచ్చే ఏడాది మార్చి 25న ఒలింపిక్‌ టార్చ్‌ రిలే ప్రారంభం

వచ్చే ఏడాది మార్చి 25న ఒలింపిక్‌ టార్చ్‌ రిలే ప్రారంభం

టోక్యో : కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది వచ్చే ఏడాది టైం టేబుల్‌ ప్రకారం నిర్వహించనున్నట్లు టోక్యో- 2020 నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 25న ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని జే-విలేజ్‌ నేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఒలింపిక్‌ టార్చ్‌ వెలిగించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 121 రోజుల వ్యవధిలో జపాన్‌లోని 47 ప్రిఫెక్చర్ల గుండా టార్చ్‌ ప్రయాణించింది.. జూలై 23 న జరిగే క్రీడల ప్రారంభోత్సవంలో ఒలింపిక్ స్టేడియంలో జ్యోతి వెలిగించే సమయానికి జూలై 9న టోక్యోకు చేరుకుంటుందని చెప్పారు. ఒలింపిక్‌ టార్చ్‌ బేరర్స్‌గా గతంలో ధ్రుకవీరించిన వారికే వచ్చే ఏడాది రిలేలో రన్‌ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని, సుమారు 10వేల మంది కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

వచ్చే ఏడాదికి ఎం9.1 గ్రేట్‌ ఈస్ట్‌ జపాన్‌ భూపంకం సంభవించి పదేళ్లు నిండనున్నాయి. భూకంపం జపాన్‌లోని తూర్పు తీర ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. ఇందులో దాదాపు 16వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 2500 మందికిపైగా ఆచూకీ నేటికీ దొరకలేదు. ‘హోప్‌ లైట్స్‌ అవర్‌ వే’ థీమ్‌కు అనుగుణంగా.. ఫుకుషిమా వంటి అత్యంత క్లిష్టమైన విపత్తు ప్రాంతాల్లో రికవరీని రిలే హైలెట్‌ చేయనుంది. టోక్యో 2020 పారాలింపిక్ టార్చ్ రిలేను ఆగస్టు 17-24 వరకు సెయిటామా, చిబా, షిజువోకాలో నిర్వహిస్తామని ప్రకటించింది. ముందు ఐదు రోజుల్లో మరో 43 ప్రాంతాల్లో లైటింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహించున్నట్లు క్రీడల నిర్వహణ కమిటీ చెప్పింది. వాస్తవానికి ఒలింపిక్స్‌ ఈ ఏడాది ఆగస్ట్‌లో జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.