ఆదివారం 24 మే 2020
Sports - Mar 27, 2020 , 00:07:19

త్వరగా తేల్చాలి.. లేదంటే ముందుకెళ్లలేం

త్వరగా తేల్చాలి.. లేదంటే ముందుకెళ్లలేం

  • టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ సీఈవో తొషిరో 

టోక్యో: ఒలింపిక్స్‌ వచ్చే ఏడాది ఎప్పుడు ప్రారంభమవ్వాలి, ఎప్పుడు ముగియాలనేది వీలైనంత త్వరగా నిర్ణయించాలని, లేకపోతే మిగిలిన ప్రణాళిక రూపొందించేందుకు ముందుకెళ్లడం కష్టమేనని టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ సీఈవో తొషిరో  ముటో వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ.. 30మంది సీనియర్‌ డైరెక్టర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. 

ఆలస్యంతో భారీ ఆర్థిక భారం

ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో వచ్చే ఏడాది నిర్వహణ ఖర్చు భారీగా పెరుగనుందని జపాన్‌కు చెందిన వ్యాపార దినపత్రిక నికీ గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల నిర్వహణ ఖర్చు అంచనా 12.6బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.94వేల కోట్లు) కాగా, వచ్చే ఏడాది నిర్వహిస్తే దానికి మరో 2.7బిలియన్‌ డాలర్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని వెల్లడించింది. 


logo