నటరాజన్‌ను జట్టు నుంచి విడుదల చేసిన తమిళనాడు..ఎందుకంటే

చెన్నై: విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ నటరాజన్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) తాజాగా విడుదల చేసింది. బీసీసీఐ అభ్యర్థన మేరకు జట్టు నుంచి నటరాజన్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర క్రికెట్ సంఘం వెల్లడించింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో నటరాజన్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం అతడికి తగినంత విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావించింది.
'ఇంగ్లాండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు నటరాజన్ తాజాగా ఉండాలని బీసీసీఐ, భారత టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నాయి. భారత జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేం అంగీకరించినట్లు' టీఎన్‌సీఏ కార్యదర్శి ఆర్ఎస్ రామస్వామి గురువారం తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లొచ్చిన నటరాజన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకవేళ విజయ్ హజారే ట్రోఫీలో బౌలింగ్ చేస్తే పనిభారం పెరుగుతుందని ఊహించిన బీసీసీఐ ముందే అప్రమత్తమైంది.
తాజావార్తలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..