సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 07, 2020 , 15:10:18

కెప్టెన్సీ నుంచి కోహ్లీని త‌ప్పించాలి..

కెప్టెన్సీ నుంచి కోహ్లీని త‌ప్పించాలి..

హైద‌రాబాద్‌:  ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఈ సారి ఆ టీమ్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో హైద‌రాబాద్ చేతిలో ఓట‌మిపాలైన విష‌యం తెలిసిందే. అయితే బెంగుళూరు కెప్టెన్ కోహ్లీని సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ అభిప్రాయ‌ప‌డ్డారు. కోహ్లీ జ‌ట్టు సార‌థ్య విష‌యంలో బాధ్య‌త‌ను తీసుకోవాల‌న్నారు. ఐపీఎల్‌లో కోహ్లీని మేటి కెప్టెన్‌గా చూడ‌రాదు అని, ఎందుకంటే ధోనీ, రోహిత్ శ‌ర్మ‌లు చాలా స‌క్సెస్ సాధించార‌న్నారు. వంద శాతం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొల‌గించాల‌ని, ఎందుకంటే ఇది అకౌంట‌బులిటీకి చెందిన విష‌యం అని, టోర్నీలో ఎనిమిదిసార్లు ప్రాతినిధ్యం వ‌హించార‌ని, ఎనిమిదేళ్లు అనేది చాలా సుదీర్ఘ‌మైన కాలం అని గంభీర్ అన్నారు.  కెప్టెన్‌గా కాదు, ఎనిమిదేళ్ల జ‌ట్టుకు ఆడి, టైటిల్ గెల‌వ‌ని ప్లేయ‌ర్ ఎవ‌రైనా ఉన్నారా అంటూ గంభీర్ కామెంట్ చేశారు. గంభీర్ నేతృత్వంలోని కేకేఆర్ జ‌ట్టు.. 2012, 2104 సంవ‌త్స‌రాల్లో ఐపీఎల్ గెలుచుకున్న‌ది.