మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 09, 2020 , 18:47:20

RR vs DC: అగ్రస్థానంపై కన్నేసిన ఢిల్లీ

RR vs DC: అగ్రస్థానంపై కన్నేసిన ఢిల్లీ

షార్జా: ఐపీఎల్‌-13లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌,  హ్యాట్రిక్‌‌ ఓటములతో  డీలాపడిన   రాజస్తాన్‌‌  రాయల్స్‌  షార్జా వేదికగా తలపడనున్నాయి.  ‌  షార్జా వేదికగా గొప్పగా రాణిస్తున్న రాజస్థాన్‌.. దుబాయ్‌, అబుదాబి మైదానాల్లో  దారుణ ప్రదర్శన చేస్తోంది. అచ్చొచ్చిన మైదానంలోనే తిరిగి గాడిలో పడాలని స్టీవ్‌స్మిత్‌ సేన భావిస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని   ఢిల్లీ అన్ని విభాగాల్లో  పటిష్ఠంగా ఉంది. జట్టులోని అందరూ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుండటంతోనే మంచి ఫలితాలు సాధిస్తోంది.

మరోవైపు, రాజస్తాన్‌‌ మాత్రం ఇప్పటికీ  తుది జట్టుపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది.  ఓపెనర్‌ జోస్‌‌ బట్లర్‌‌ ఫామ్‌‌లోకి రావడం  ఆ జట్టుకు కలిసొచ్చే  అంశం.  ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌‌లాడిన రాజస్థాన్‌ కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది.  ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ఢిల్లీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌పై ఎలాగైనా గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని క్యాపిటల్స్‌ భావిస్తోంది.  ఢిల్లీ  జోరును రాజస్థాన్‌ ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.