మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 02:10:53

కోహ్లీకి పితృత్వ సెలవులు

కోహ్లీకి పితృత్వ సెలవులు

  • ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు దూరం.. రోహిత్‌ శర్మకు చోటు 

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతుండడంతో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ(పెటర్నటీ) సెలవులు మంజూరు చేసింది.  దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మూడు టెస్టులకు విరాట్‌ దూరం కానున్నాడు. ఈ మేరకు ఆసీస్‌ టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్లలో బీసీసీఐ సోమవారం మార్పులు చేసింది. గాయం కారణంగా టూర్‌కు తొలుత ఎంపిక కాని ఓపెనర్‌ రోహిత్‌ శర్మను టెస్టు సిరీస్‌ కోసం తీసుకుంది. అతడికి పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చింది.  భారత జట్టుకు తొలిసారి ఎంపికైన నైట్‌ రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గాయ ం కారణంగా టీ20 టీమ్‌లో చోటు కోల్పోగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టిన నటరాజన్‌ బెర్తు దక్కించుకున్నాడు. వన్డే జట్టులోకి అదనపు కీపర్‌గా సంజూ శాంసన్‌ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా నవంబర్‌ 27 నుంచి జనవరి 19 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు