ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 14, 2021 , 14:58:31

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌.. టికెట్ల అమ్మకాలు ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌.. టికెట్ల అమ్మకాలు ప్రారంభం

అహ్మదాబాద్‌:మొతేరాలో గల ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టుకు టికెట్ల బుకింగ్‌ ఆదివారం ప్రారంభమైందని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌, ఇంగ్లాండ్‌(మూడో టెస్టు) మధ్య ఈ నెల 24న ఆరంభంకానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.  అందులో ఒకటి డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ ఉంది.

ఇరుజట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు ఇక్కడే జరగనున్నాయి. రెండు మ్యాచ్‌లకు 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.  పింక్‌ బాల్‌ టెస్టు టికెట్ల ధర రూ.300 నుంచి 1000 మధ్య ఉంటుంది.  మొతేరా స్టేడియంలో ఒకేసారి 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. 

VIDEOS

logo