గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 23, 2021 , 14:52:07

ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా

ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా

ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ముగ్గురు ఆటగాళ్లను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. 

గతవారమే మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్లేయర్లకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇరుజట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఓ క్రికెటర్‌కు  కరోనా సోకింది. 

VIDEOS

logo