సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 02:09:03

పీసీసీఎఫ్‌కు మూడు పతకాలు

 పీసీసీఎఫ్‌కు మూడు పతకాలు

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: అటవీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఆ శాఖ అధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ పాల్గొని క్రీడాస్ఫూర్తి ప్రదర్శించారు. ఆదివారం దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో జరిగిన చివరి రోజు పోటీల్లో వెటరన్‌ షాట్‌పుట్‌, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో ఆమె మూడు పతకాలు గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా బీట్‌ అధికారి ఎం. సునీత, ఉత్తమ క్రీడాకారుడిగా రేంజ్‌ అధికారి రమేశ్‌కుమార్‌ పతకాలు గెలుచుకున్నారు. క్రీడాపోటీల ముగింపు కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ రఘువీర్‌, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo