మంగళవారం 02 జూన్ 2020
Sports - Feb 08, 2020 , 07:00:32

ఎన్‌ఆర్‌ఐపై అత్యాచారం..అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌

ఎన్‌ఆర్‌ఐపై అత్యాచారం..అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి  బ్లాక్‌మెయిలింగ్‌

ఫేస్‌బుక్‌ ద్వారా ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళతో పరిచయం పెంచుకుని, ఆమె నగరానికి చేరుకున్న అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అంతటితో ఆగకుండా బాధితురాలి నగ్నదృశ్యాలను ఫొటోలుతీసి, వీడియోలో చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తూ అందినకాడికి దండుకున్నాడు.

ఫేస్‌బుక్‌ ద్వారా ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళతో పరిచయం పెంచుకుని, ఆమె నగరానికి చేరుకున్న అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అంతటితో ఆగకుండా బాధితురాలి నగ్నదృశ్యాలను ఫొటోలుతీసి, వీడియోలో చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తూ అందినకాడికి  దండుకున్నాడు. అయితే రోజురోజుకు వేధింపులు అధికమవుతుండడంతో తాళలేని ఎన్‌ఆర్‌ఐ మహిళ బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు నిందితులను శుక్రవారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంతదుర్మార్గానికి ఒడిగట్టిన నీచుడికి సహకరించింది కట్టుకున్న భార్య, మేనల్లుడు కావడం సభ్యసమాజం తలదించుకునే విషయం.

కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన మామిడి సంజీవరెడ్డి(52), కావేరి(45) దంపతులు. హైదరాబాద్‌ నగరశివారు, నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలోని బాచుపల్లిలో తాత్కాలికంగా ఇంటిని కిరాయికి తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న కోకాపేటకు చెందిన ఓ మహిళ సంజీవరెడ్డికి 2018 జూలైలో ఫేస్‌బుక్‌ద్వారా పరిచయమైంది. అప్పటినుంచి ఇద్దరు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేయడంతో పాటు పరస్పరం ఫోన్‌చేసుకుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబర్‌ 31న సదరుమహిళ అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌లో సంజీవరెడ్డి బాధితురాలిని రిసీవ్‌చేసుకుని ఆమె చెల్లెలి ఇంటివద్ద వదిలిపెట్టాడు. రెండు రోజుల తర్వాత అంటే నవంబర్‌ 2న లంచ్‌కు రావాలని సదరు మహిళను కోరగా ఆమె కూకట్‌పల్లిలోని సితారహోటల్‌కు వచ్చింది. అక్కడ సంజీవరెడ్డి తనభార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిలను పరిచయం చేశాడు. అందరూ కలిసి లంచ్‌చేద్దామని కోరగా ఆమె నిరాకరించడంతో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించారు. అనంతరం సృహతప్పి పడిపోవడంతో ఆమెను కారులో ఎక్కించుకుని బాచుపల్లిలోని వారు కిరాయికి ఉంటున్న ఇంటికి తీసుకువచ్చారు. 

భర్త లైంగిక దాడి.. వీడియోలు తీసిన భార్య

అనంతరం సంజీవరెడ్డి ఎన్‌ఆర్‌ఐ మహిళను వివస్త్రనుచేసి లైంగికదాడికి పాల్పడగా అతడి భార్య కావేరి బాధితురాలి అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసింది. ఆ తర్వాత సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు  ఆమెను బెదింపులకు గురిచేస్తూ తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తాము తీసిన అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పెడుతామంటూ బయపెట్టారు. ఇలా బాధితురాలి వద్ద నుంచి గడిచిన ఏడాదిన్నర కాలంగా 30 తులాల బంగారు ఆభరణాలు, 6000 యూఎస్‌ డాలర్లతో పాటు పలు బ్యాంకుల చెక్కులను బలంవంతంగా లాక్కున్నారు. 

ఇలామొత్తంగా రూ.50లక్షల వరకు బలవంతంగా దండుకున్నారు. ఇందుకు నిందితుడి భార్య కావేరితో పాటు వారి మేనల్లుడు విశాల్‌రెడ్డి(22) సైతం బాధితురాలిని బెదిరిస్తుండడంతో సహణం కోల్పోయిన బాధితురాలు రెండురోజుల కిందట బాచుపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితులను బీదర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు సైతం సంజీవరెడ్డి సెల్‌ఫోన్‌లో లభించాయి. దీంతో శుక్రవారం నిందితులను ఐపీసీ సెక్షన్‌ 328, 420, 354(బీ)(సీ), 384, 392, 506, 67ఏ ఐటీ యాక్ట్‌, సెక్షన్‌25(1)ఏ, ఏఆర్‌ఎంఎస్‌ యాక్టు ప్రకారం అరెస్ట్‌చేసిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు.


logo