ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 22, 2021 , 00:49:56

టీహెచ్‌ఆర్‌ ఎలెవన్‌ గెలుపు

టీహెచ్‌ఆర్‌ ఎలెవన్‌ గెలుపు

సిద్దిపేట కలెక్టరేట్‌, ఫిబ్రవరి 21: సిద్దిపేట మినీ స్టేడియంలో టీహెచ్‌ఆర్‌ ఎలెవన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరిగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో టీహెచ్‌ఆర్‌ జట్టు విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీహెచ్‌ఆర్‌ జట్టు తరఫున ఓపెనర్లుగా మంత్రి హరీశ్‌రావు, సినీ గాయకుడు రేవంత్‌లు బరిలోకి దిగారు. మంత్రి హరీశ్‌రావు 22 పరుగులు, రేవంత్‌ 32 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యఛేదనలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ జట్టు 150 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

VIDEOS

logo