శనివారం 16 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 01:40:16

క్రికెటే జీవితమని అప్పుడు అనుకున్నా: కోహ్లీ

క్రికెటే జీవితమని అప్పుడు అనుకున్నా: కోహ్లీ

అడిలైడ్‌లో డే అండ్‌ టెస్టు సమరానికి ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ముఖాముఖి మాట్లాడుకున్నారు. క్రికెట్‌ కెరీర్‌, జీవితానుభవాలు తదితర అంశాలను పరస్పరం పంచుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడు అనుకున్నావని కోహ్లీని స్మిత్‌ ప్రశ్నించాడు. దీంతో విరాట్‌ సమాధానమిచ్చాడు. తన తండ్రి చనిపోయిన సమయంలో ఇక క్రికెటే తన జీవితం నిశ్చయించుకున్నానని, అప్పుడు ఆటను మరింత సీరియస్‌గా తీసుకున్నట్టు విరాట్‌ చెప్పాడు. 

అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడాలని నేను చిన్నప్పుటి నుంచే కోరుకున్నా. అయితే మా నాన్న చనిపోయినప్పుడు ఇక క్రికెటే నా కెరీర్‌ అని బలంగా నిశ్చయించుకున్నా. అప్పుడు ఆటను మరింత సీరియస్‌గా తీసుకున్నా. సరైన సంకల్పంతో ముందుకు సాగా. నా ఏకాగ్రత ఎప్పుడూ చెదరలేదు. టీమ్‌ఇండియాకు ఆడడంపైనే పూర్తి దృష్టిసారించా. జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతానా అన్నది కూడా నేను ఆలోచించలేదు. ఏదేమైన లక్ష్యం వైపునకు ముందుకు సాగాలనుకున్నా అని స్మిత్‌తో కోహ్లీ చెప్పాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డే అండ్‌ నైట్‌గా జరిగే తొలి టెస్టు గురువారం ప్రారంభం కానుంది. 2018-19 పర్యటనలో ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా.. మరోసారి సత్తాచాటాలని పట్టుదలగా ఉంది.