శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:43

ఆ రెండు సాధించాలి: స్మిత్‌

 ఆ రెండు సాధించాలి: స్మిత్‌

మెల్‌బోర్న్‌: ఇంగ్లండ్‌ గడ్డపై యాషెస్‌ సిరీస్‌ చేజిక్కించుకోవడం.. భారత గడ్డపై టీమ్‌ఇండియాను ఓడించడం తన ముందున్న లక్ష్యాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. కెరీర్‌కు వీడ్కోలు పలకడానికి ముందు ఈ రెండు శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నట్లు చెప్పాడు. స్మిత్‌ బుధవారం మాట్లాడుతూ.. ‘కెరీర్‌ ముగించేలోపు ఆ రెండు ఘనతలు సాధించాలి. అవి నాకు ఎంతో ప్రత్యేకమైనవి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు’ అని స్మిత్‌ అన్నాడు. 


logo