బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 00:30:37

భారత జట్లకు ఐదో సీడ్‌

భారత జట్లకు ఐదో సీడ్‌

న్యూఢిల్లీ: థామస్‌, ఉబెర్‌ కప్‌లలో భారత బ్యాడ్మింటన్‌ జట్లకు సులువైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ టోర్నీలు డెన్మార్క్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు.. డెన్మార్క్‌, జర్మనీ, అల్జీరియాతో కలిసి గ్రూప్‌ ‘సి’లో ఉంది. ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు.. 14 సార్లు విజేత చైనా, ఫ్రాన్స్‌, జర్మనీతో కలిసి గ్రూప్‌ ‘డి’లో ఉంది. ఈ మేరకు బీడబ్ల్యూఎఫ్‌ సోమవారం ‘డ్రా’వివరాలు వెల్లడించింది. రెండు టోర్నీల్లో మన జట్లకు ఐదో సీడ్‌ దక్కింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మేలో జరుగాల్సిన ఈ టోర్నీలు తొలుత ఆగస్టుకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి అక్టోబర్‌కు మార్చారు.

తాజావార్తలు


logo