శుక్రవారం 03 జూలై 2020
Sports - Jun 19, 2020 , 00:35:46

మా దళమే అత్యుత్తమం: షమీ

మా దళమే అత్యుత్తమం: షమీ

న్యూఢిల్లీ: దేశ టెస్టు క్రికెట్‌ చరిత్రలో ప్రస్తుత పేస్‌ దళమే అత్యున్నతమైనదని భారత జట్టు సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ చెప్పాడు. మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌ దాస్‌గుప్తాతో గురువారం  ఓ కార్యక్రమంలో  షమీ మాట్లాడాడు. తాను, ఇషాంత్‌, బుమ్రా, ఉమేశ్‌.. గంటకు 145కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలుగుతున్నామన్నాడు. తమ మధ్య అసలు ఈర్ష్య లేదని షమీ స్పష్టం చేశాడు. ఒకరి విజయాన్ని ఒకరం ఆస్వాదిస్తున్నామన్నాడు.  


logo