శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 12:13:43

ఐపీఎల్ వేలంలో ఉన్న స్టార్ ప్లేయ‌ర్స్ వీళ్లే..

ఐపీఎల్ వేలంలో ఉన్న స్టార్ ప్లేయ‌ర్స్ వీళ్లే..

ముంబై: వ‌చ్చే నెల 18న జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ మినీ వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే త‌మ ద‌గ్గర ఉన్న కొంత‌మంది ప్లేయ‌ర్స్‌ను వ‌దిలేసిన ఫ్రాంచైజీలు.. ఇప్పుడు వేలంలో త‌మ‌కు కావాల్సిన ప్లేయ‌ర్స్ కోసం బిడ్ వేయ‌నున్నాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ స్టీవ్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆరోన్ ఫించ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిల‌వ‌నున్నారు. మ‌రోవైపు బిగ్‌బాష్ లీగ్ కూడా కొన‌సాగుతుండ‌టంతో అక్క‌డి ప్లేయ‌ర్స్‌పైనా ఓ క‌న్నేసి ఉంచాయి ఫ్రాంచైజీలు. ముఖ్యంగా జోష్ ఇంగ్లిస్‌, జేక్ వెదెరాల్డ్‌, క్రెయిగ్ మెక్‌డెర్మాట్‌లాంటి ప్లేయ‌ర్స్‌కు వేలంలో డిమాండ్ ఉండే అవ‌కాశం ఉంది. 

ఐపీఎల్ వేలంలో ఉన్న ప్లేయ‌ర్స్ వీళ్లే: స‌్టీవ్ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఫించ్‌, క్రిస్ మోరిస్‌, కేదార్ జాద‌వ్‌, ముర‌ళీ విజ‌య్‌, పియూష్ చావ్లా, అలెక్స్ కేరీ, కీమో పాల్‌, తుషార్ దేశ్‌పాండే, సందీప్ లామిచానె, మోహిత్ శ‌ర్మ‌, జేస‌న్ రాయ్‌, షెల్డ‌న్ కాట్రెల్‌, ముజీబుర్ రెహ‌మాన్‌, హార్డ‌స్ విలియోన్‌, జేమ్స్ నీష‌మ్‌, క్రిష్ణ‌ప్ప గౌత‌మ్‌, క‌రుణ్ నాయ‌ర్‌, జ‌గ‌దీశ సుచిత్‌, తేజింద‌ర్ సింగ్ ధిల్లాన్‌, క్రిస్ గ్రీన్‌, హ్యారీ గుర్నీ, ఎం. సిద్దార్థ్‌, నిఖిల్ నాయ‌క్‌, సిద్ధేశ్ లాడ్‌, టామ్ బాంట‌న్‌, ప్రిన్స్ బ‌ల్వంత్ రాయ్‌, దిగ్విజ‌య్ దేశ్‌ముఖ్‌, నేథ‌న్ కూల్ట‌ర్‌నైల్‌, జేమ్స్ పాటిన్‌స‌న్‌, షెర్ఫానె రూథ‌ర్‌ఫ‌ర్డ్‌, మిచెల్ మెక్‌క్లెన‌గ‌న్‌, ఆకాశ్ సింగ్‌, అనిరుద్ధ జోషి, అంకిత్ రాజ్‌పుత్‌, ఒషానె థామ‌స్‌, శ‌శాంక్ సింగ్‌, టామ్ క‌ర‌న్‌, వ‌రుణ్ ఆరోన్‌, శివ‌మ్ దూబె, ఉమేష్ యాద‌వ్, మోయిన్ అలీ, పార్థివ్ ప‌టేల్‌, ప‌వ‌న్ నేగి, ఇసురు ఉడానా, గురుకీర‌త్ మ‌న్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, సందీప్ బ‌వ‌నాకా, ఫాబియ‌న్ అలెన్‌, సంజ‌య్ యాద‌వ్‌, పృథ్విరాజ్ య‌ర్రా.

VIDEOS

logo