గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 21:45:48

ధోని, కోహ్లీల మధ్య వ్యత్యాసం ఇదే : అగార్కర్‌

ధోని, కోహ్లీల మధ్య వ్యత్యాసం ఇదే : అగార్కర్‌

ధోనీ, కోహ్లీల కెప్టెన్సీ మధ్య అజిత్‌ అగార్కర్‌ ఓ ఆసక్తికర వ్యత్యాసం చూపించాడు. స్టార్‌ స్పోర్ట్స్ షోలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ‘ధోనీ అతిగా స్పిన్నర్లపై ఆధారపడితే.. విరాట్ కోహ్లీ మాత్రం ఫాస్ట్ బౌలర్లపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా రాణించడానికి ఇది కూడా కారణం. టీమ్‌ని నడిపించడంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయాలు సాధిస్తున్నాడు. టీమ్‌లోని ఆటగాళ్లపై కెప్టెన్‌ నమ్మకం ఉంచినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి‘అని అగార్కర్ వెల్లడించాడు.

1998లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ అగార్కర్.. 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 2007లో అంతర్జాతీయ క్రికెట‌్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టెస్టుల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన అజిత్ అగార్కర్.. వన్డేల్లో మాత్రం 5.07 సగటుతో 288 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ 42 మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 29 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo