గురువారం 09 జూలై 2020
Sports - Apr 18, 2020 , 01:07:24

తొందరపాటు తగదు

తొందరపాటు తగదు

  • టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సి ఉంది. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణతో క్రీడాలోకం స్తంభించిపోగా.. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021కి  వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ‘ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాం. ప్రస్తుత పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. నిపుణుల సలహాలతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వంతోనూ సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఇప్పుడప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోం’ అని ఆయన పేర్కొన్నారు.


logo