బుధవారం 08 జూలై 2020
Sports - May 13, 2020 , 21:35:55

ఇది పిచ్చితనమే: పీటర్సన్​ ఆగ్రహం

ఇది పిచ్చితనమే: పీటర్సన్​ ఆగ్రహం

లండన్​: కరోనా వైరస్​ తీవ్రంగా ఉన్న సమయంలో లండన్​లో భౌతిక దూరాన్ని పాటించని ప్రజల పట్ల ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్​మన్ కెవిన్ పీటర్సన్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వైరస్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు సాగించాలని బ్రిటన్ ప్రభుత్వం చెప్పినా… పూర్తిగా నిండి ఉన్న బస్సు నుంచి ప్రజలు భారీ సంఖ్యలో దిగడంపై కెవిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో బుధవారం పంచుకున్నాడు. “ఈ ఉదయం లండన్​లో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. మళ్లీ పూర్తిస్థాయి లాక్​డౌన్ వచ్చేలా ఉంది!. ఇది పిచ్చితనమే” అని పీటర్సన్ పేర్కొన్నాడు. 


logo