సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 15:31:18

నా జీవితంలో మ‌రుపు రాని రోజు ఇది: రిష‌బ్ పంత్‌

నా జీవితంలో మ‌రుపు రాని రోజు ఇది: రిష‌బ్ పంత్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంతో ఇండియ‌న్ క్రికెట్‌లో కొత్త హీరోగా అవ‌త‌రించాడు రిష‌బ్ పంత్‌. 138 బంతుల్లో 89 ప‌రుగుల‌తో ఈ మ‌రుపురాని విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అత‌ని ఇన్నింగ్స్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోవ‌డం ఖాయం. కొన్నేళ్ల పాటు పంత్ ఇన్నింగ్స్‌ను ప్ర‌తి భార‌త అభిమాని గుర్తుంచుకుంటాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 32 ఏళ్లుగా గ‌బ్బాలో మాకు ఓట‌మే లేద‌ని విర్ర‌వీగుతున్న కంగారూల పీచ‌మ‌ణ‌చిన ఘ‌న‌త పంత్ సొంతం. ఇంత‌టి ఘ‌నత సాధించిన పంత్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాల్లేకుండా పోయాయి. 

క‌ల నిజ‌మైంది..

త‌న జీవితంలో ఇది మ‌రుపురాని రోజు అని పంత్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత అన్నాడు. నా క‌ల నిజ‌మైంది. నేను ఫామ్‌లో లేని స‌మ‌యంలో టీమ్ నాకు మ‌ద్ద‌తుగా నిలిచింది. తొలి టెస్ట్ త‌ర్వాత నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాం. టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ నాకు అండ‌గా ఉంది. నేనో మ్యాచ్ విన్న‌ర్ అంటూ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని పంత్ అన్నాడు. 

VIDEOS

logo