గురువారం 02 జూలై 2020
Sports - May 19, 2020 , 17:10:09

ఈ పిల్లి.. గోల్‌కీపింగ్‌ అదరగొట్టిందిగా..

ఈ పిల్లి.. గోల్‌కీపింగ్‌ అదరగొట్టిందిగా..

ఓ పిల్లి ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను తలపించేలా గోల్‌ కీపింగ్‌ చేసి ఔరా అనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంతులు గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా పిల్లి డైవ్‌లు చేసి మరీ అడ్డుకుంది. ఈ వీడియోను యూట్యూబర్‌ క్రిస్‌ డిక్సన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. జర్మన్‌ గోల్‌కీపర్‌ మ్యానుయెల్‌ నెయుర్‌ మీద ఉన్న ఇష్టంతో  ఆ పిల్లికి సైతం ఆ పేరునే పెట్టాడు. ఈ వీడియోను షేర్‌ చేసి.. దీనికి ఆ పేరు పెట్టి పొరపాటు చేసినట్టున్నా అని సరదాగా పేర్కొన్నాడు. వీడియోలో.. డిక్సన్‌ బంతిని గోల్‌ పోస్ట్‌లోకి కొట్టేందుకు ప్రయత్నించినప్పుడల్లా.. పిల్లి అడ్డుకుంది. ఈ వీడియోకు నెటిజన్లు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  


logo