సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 29, 2020 , 00:12:59

కెవిన్‌ భారీ సిక్సర్‌.. కారు అద్దాలు బద్దలు

కెవిన్‌ భారీ సిక్సర్‌.. కారు అద్దాలు బద్దలు

లండన్‌: ఐర్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ ఓబ్రియాన్‌కు వింత అనుభవం ఎదురైంది. డబ్లిన్‌ వేదికగా జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో కెవిన్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం బయటకు వచ్చి చూస్తే.. అతడి కారు అద్దం పగిలిపోవడంతో ఆశ్చర్యపోయాడు. నార్త్‌వెస్ట్‌ వారియర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లైన్‌స్టర్‌ లైట్నింగ్‌ తరఫున బరిలో దిగిన కెవిన్‌ 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో అతడు 8 సిక్సర్లు కొట్టాడు. అందులో ఓ సిక్సర్‌ మైదానం బయట పార్క్‌ చేసి ఉన్న తన కారు అద్దానికి తగిలింది. ఇంటికి వెళ్లేందుకు కారు దగ్గరకు వచ్చిన కెవిన్‌ అది చూసి నవ్వుకొని ఇకపై ఇంకా దూరంగా పార్క్‌ చేస్తానని చెప్పాడు. ఓబ్రియాన్‌ ధాటికి మ్యాచ్‌లో లైట్నింగ్‌ జట్టు గెలిచింది. 


logo