ప్రేక్షకుల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న భారత్

గత ఏడాది ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు టీ 20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అద్భుతమైన ఆటతీరుతో టెస్ట్ సిరీస్ గెలుచుకున్న భారత యువజట్టుపై ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సమరానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. 13 నుంచి 17 వరకు చెన్నై వేదికగానే రెండో టెస్ట్ జరగనుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌లకు వీక్షకులని మైదానాలలోకి అనుమతించరని తెలుస్తుంది.
అయితే కరోనా నిబంధనలను మరింతగా సడలించిన కేంద్ర ప్రభుత్వం.. మైదానాల్లోకి 50 శాతం మంది వరకు వీక్షకులను అనుమతించ వచ్చని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో మూడు, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లకు 50 శాతం ప్రేక్షకులని మైదానాలలోకి అనుమతించనున్నారు. మొతేరా సీటింగ్ సామర్థ్యం లక్ష కంటే ఎక్కువ కాబట్టి.. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఏ) 50 శాతం మందిని సులభంగా అనుమతించవచ్చు. మీడియా కూడా స్టేడియం నుంచే మ్యాచును కవర్ చేసుకోవచ్చు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం స్వదేశంలో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం, ప్రేక్షకులను అనుమతించడం కూడా ఇదే మొదటి సారి కావడంతో , మూడో టెస్ట్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం పలికాలని బీసీసీఐ యోచిస్తోంది.
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం