మంగళవారం 09 మార్చి 2021
Sports - Feb 04, 2021 , 02:48:39

అవసరమైతే మరిన్ని నిధులు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు

అవసరమైతే మరిన్ని నిధులు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు

న్యూఢిల్లీ: క్రీడారంగానికి అవసరసమైతే మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని అడుగుతానని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ఒలింపిక్స్‌ ఏడాదిలో క్రీడలకు నిధుల కొరత ఏ మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి క్రీడా బడ్జెట్‌లో రూ. 230 కోట్ల కోత విధించిన సంగతి తెలిసిందే. బుధవారం ఇక్కడి జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఫిట్‌ ఇండియా కార్యాలయం ప్రారంభం సందర్భంగా బడ్జెట్‌ విషయంపై రిజిజు మాట్లాడారు. ‘క్రీడా సమాఖ్యల ద్వారా అథ్లెట్లకు డబ్బు అందిస్తాం. ట్రైనింగ్‌తో పాటు ఏ విషయానికి నిధుల కొరత లేదు. అవసరమైతే మరిన్ని తీసుకొస్తాం’ అని రిజిజు అన్నారు.


VIDEOS

logo