సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 14, 2020 , 02:32:34

విజేత వెర్‌స్టాపెన్‌

విజేత వెర్‌స్టాపెన్‌

అబుదాబి: ఫార్ములావన్‌ (ఎఫ్‌ 1) సీజన్‌ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ ప్రిని రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సొంతం చేసుకున్నాడు. పోల్‌ పొజిషన్‌తో ఆదివారం ఫైనల్‌ రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌.. రెండో స్థానంలో నిలిచిన వాల్తెరి బొటాస్‌ కంటే 16 సెకన్ల ముందు లక్ష్యాన్ని చేరుకున్నాడు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న ప్రపంచ చాంపియన్‌ మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 రేసులు జరుగగా.. అందులో 11 రేసుల్లో హామిల్టన్‌ విజేతగా నిలిస్తే.. బొటాస్‌, వెర్‌స్టాపెన్‌ చెరో రెండు గెలుచుకున్నారు. మిగతా రెండు రేసుల్లో గ్యాస్లీ, పెరెజ్‌ విజేతలుగా నిలిచారు. 


logo