హైదరాబాద్, మే 30: గోంగూర అంటే చిన్నా, పెద్ద అనే తేడాలు లేకుండా అందరూ ఇష్టపడతారు. ఇది రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కర స్థాయిని తగ్గించి షుగర్ రాకుండా చేస్తాయి. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
గోంగూరలో విటమిన్ ఏ, బి 1, బి 2, బి 9 తోపాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను రాకుండా చేస్తుంది. రేచీకటిని కూడా రాకుండా చేస్తుంది. అంతేకాదు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి కనీసం వారానికి రెండు సార్లయినా గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. దీనిలో చాలా తక్కువ కొవ్వు ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు, కాన్సర్ వంటి సమస్యలను కూడా నివారించడంలో సహాయపడుతుంది. దగ్గు, ఆయాసంతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే మంచిది. గోంగూరను ఎండబెట్టి పొడి చేసి చర్మ సమస్యలు వచ్చినప్పుడు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు గోంగూర ఆకులను మెత్తగా చేసి ముఖానికి రాసుకుంటే ముడుతలు మాయం అవుతాయి. అంతేకాదు ఈ పేస్ట్ తలకు రాసుకుంటే జుట్టు ఊడడం తగ్గుతుంది.