మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 08, 2020 , 00:47:32

న్యూజిలాండ్‌-ఏ 276/5

 న్యూజిలాండ్‌-ఏ  276/5
  • భారత్‌-ఏతో రెండో అనధికారిక టెస్టు

లింక్లిన్‌ (న్యూజిలాండ్‌): అనధికారిక టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌-ఏ బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగుతున్నది. భారత్‌-ఏతో జరిగిన తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న ఆ జట్టు.. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులోనూ మంచి స్కోరు దిశగా పయనిస్తున్నది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌-ఏ తొలి రోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసిం ది. కెప్టెన్‌ హమీష్‌ (40), ఫిలిప్స్‌ (65), సీఫర్ట్‌ (30), క్లీవర్‌ (46 నాటౌట్‌), డారిల్‌ (36 నాటౌట్‌) తలాకొన్ని పరుగులు చేశారు. మన బౌలర్లలో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
logo
>>>>>>